Monday, October 8, 2012

మెదక్ యాసల..!!

ఈ మద్యల "మిట్టూరోడి కథలు" పుస్తకం సదివిన. అన్నిటికంటే ఆ పుస్తకంల మంచిగనిపిచ్చింది యాస. సినిమాలల్ల సూసుడు తప్ప నకు రాయలసీమ యాస గురించి ఎక్వ ఏం తెల్వది. కని సదువుతుంటే ఎందుకో మంచి authentic గ అనిపిచ్చింది.
మొన్ననే 'నలభీమ పాకం" బ్లాగ్ జూష్న. ఇది గూడ  రాయలసీమ accent లనే, మంచి interesting గ ఉండె. (ఇంక లింకులిచ్చుడు సంగతి చూడలే, చూష్నంక ఇస్త లింకు) బ్లాగ్లల్లనన్న ఎవల accent ల వాల్లు రాస్కుంటె మంచిగుంటది గదా అనిపిచ్చింది, ఎంత సేపు గదే పుస్తకాల, న్యూస్ పేపర్ల భాషల ఏం రాస్కుంటం, ఏం సదువుతం.
అగో అందుకే మా మెదక్ యాసల ఏమన్న రాద్దామని ఈ బ్లాగ్ చేష్న అన్నట్టు. సూద్దాం ఎన్ని రోజులు రాస్తనో, ఏం రాస్తనో..